జిల్లా ప్రొఫైల్
కోనసీమ జిల్లా 4వ తేదీ ఏప్రిల్ నెల 2022వ సంవత్సరమున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన జిల్లాల విభజనలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా నుండి వేరుపడి ఏర్పడినది. జిల్లా ప్రధాన కార్యాలయం అమలాపురంలో ఉంది. అమలాపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ యొక్క ఈశాన్య-తూర్పు తీరంలో ఉంది మరియు ఉత్తరాన కాకినాడ జిల్లా , తూర్పున బంగాళాఖాతం, పశ్చిమ దిక్కున తూర్పు గోదావరి జిల్లా మరియు దక్షిణాన నరసాపురం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
జిల్లా వైశాల్యం 2081.16 చ.కి.మీ.లు. 2011 జనాభా లెక్కల ప్రకారం దీని జనాభా 1,71,90,93 జిల్లాలో కాకినాడ మరియు పెద్దాపురం అనే 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.